కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్‌ కష్టాలు తీర్చే దారిది!

విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి.

Updated : 05 Jul 2024 09:05 IST

విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. వెంకటపాలెం- కాజ మధ్య రహదారి నిర్మాణం పూర్తికావస్తోంది. సూరాయపాలెం వద్ద కృష్ణానదిపై భారీ వంతెన నిర్మిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సుమారు 3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ బైపాస్‌ పనులు పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది. హైదరాబాద్, ఏలూరుల నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజ వద్ద చెన్నై హైవేని చేరుకోవచ్చు. ఆయా నగరాల నుంచి తొందరగా రాజధాని అమరావతికి సైతం రాకపోకలు సాగించొచ్చు.         

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని