నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్‌ ధ్రువీకరించారు.

Published : 05 Jul 2024 07:04 IST

కర్నూలు నుంచి ఒకటి.. నల్లమల కారిడార్‌ నుంచి మరొకటి రాక

ట్రాప్‌ కెమెరాలో కనిపించిన పెద్దపులి

నెల్లూరు(బృందావనం), మర్రిపాడు- న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్‌ ధ్రువీకరించారు. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు రేంజ్‌ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు ‘న్యూస్‌టుడే’కు గురువారం తెలిపారు. వాటిలో ఒకటి రాపూరు పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతోందన్నారు. ఇది కర్నూలు టైగర్‌ కారిడార్‌ నుంచి రెండు నెలల క్రితమే వచ్చిందని వెల్లడించారు. మరొకటి గత ఏడాది సెప్టెంబరులో నల్లమల కారిడార్‌ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడకు వస్తున్నాయని తెలిపారు.  అవి సంచరించే ప్రాంతాల్లో నీటి కుంటలు, 18 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని