హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు.

Published : 04 Jul 2024 05:51 IST

జీఓలు జారీ చేసిన న్యాయశాఖ కార్యదర్శి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. వీరి నియామకానికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) వి.సునీత బుధవారం వేర్వేరుగా జీఓలు జారీ చేశారు. జీపీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు.. గుజ్జర్లపూడి రాజు, జె.దిలీప్‌కుమార్, నాగూరు నాగరాజు, యెలిశెట్టి సోమరాజు, కేఎం కృష్ణారెడ్డి, పొన్నూరు వెంకట సాయి కృష్ణ ఉన్నారు. జి.ప్రశాంతి, కజులూరి ప్రియాంక లక్ష్మి, పొట్లూరి సుదీప్తి, వడ్లపట్ల దిషాచౌదరి, దిగుమర్తి ఏడుకొండలు, నేరెళ్ల ఎస్వీ రవితేజ, షేక్‌ అబ్దుల్‌రషీద్‌ అహ్మద్, పెనుమాక అజయ్‌బాబు, సీపని సతీష్‌కుమార్, చిన్నాల ప్రవీణ్, ఎస్‌.శరత్‌కుమార్, గడికోట దివ్యతేజ, ఎ సాయిరోహిత్, కొల్లూరి అర్జున్‌చౌదరి ఏజీపీలుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మూడేళ్లు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. 

బలహీనవర్గాలకు పెద్దపీట

ఇటీవల ఎస్‌జీపీలుగా నియమితులైన ఇద్దరితో పాటు తాజాగా ఆరుగురు జీపీలను ప్రభుత్వం నియమించింది. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు బీసీలు, ఒక్కొక్కరి చొప్పున ఎస్సీ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరోవైపు ఏజీపీలుగా నియమితులైన 14 మందిలో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారు 8 మంది ఉండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని