ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి

ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Published : 04 Jul 2024 05:49 IST

పదవీ విరమణ చేసిన వారిని రిలీవ్‌ చేయాలన్నా పట్టించుకోని వైనం 

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖతారు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. పదవీవిరమణ చేసి, వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఉన్నత విద్యామండలి వీటిని పట్టించుకోకుండా సీనియర్‌ అసిస్టెంట్‌గా పదవీవిరమణ చేసిన వరప్రసాదరావు అనే ఉద్యోగిని కొనసాగిస్తోంది. పైగా ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కట్టబెట్టింది. ఆయన సర్వీసు అత్యవసరమని, కొనసాగించాలంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌కు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ లేఖ రాశారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాలను పదవీవిరమణ చేసిన అధికారి చేతిలో పెట్టి, ఆయన్ను కొనసాగించాలంటూ కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యామండలి తరఫున చేసే కొనుగోళ్లు, చెల్లింపులు, అకౌంటింగ్‌ వ్యవహారాలను పదవీవిరమణ చేసిన వారికి అప్పగించకూడదనే నిబంధన ఉన్నా అధికారులు దాన్ని తుంగలోకి తొక్కారు. లయోలా కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదవీవిరమణ చేసిన వరప్రసాదరావును గతేడాది నవంబరులో అప్పటి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి నియమించుకొని ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని