సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ ఏఓఆర్‌గా గుంటూరు ప్రమోద్‌కుమార్‌

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ (ఏఓఆర్‌)గా గుంటూరు ప్రమోద్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ బుధవారం జీవో విడుదల చేసింది.

Published : 04 Jul 2024 04:52 IST

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ (ఏఓఆర్‌)గా గుంటూరు ప్రమోద్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ బుధవారం జీవో విడుదల చేసింది. 2010లో దిల్లీ అమిటీ యూనివర్సిటీ నుంచి ఆయన న్యాయశాస్త్రం పూర్తిచేశారు. 2011 నుంచి 2014 మధ్యలో సీనియర్‌ అడ్వొకేట్‌గా ఉన్న మాజీ సీజేఐ జస్టిస్‌ యుయు లలిత్‌ వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2014 నుంచి 2019 వరకు కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు ఏపీ ప్రభుత్వం తరఫున ప్యానల్‌ అడ్వొకేట్‌గా పనిచేశారు. ఏఓఆర్‌గా ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని