విద్యుత్‌ సంస్థల్లో 10 మంది డైరెక్టర్ల రాజీనామా

ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల డైరెక్టర్ల రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కొందరు గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Updated : 04 Jul 2024 06:35 IST

ఈనాడు, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల డైరెక్టర్ల రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కొందరు గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లే నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. కొద్ది రోజుల కిందట ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆ సమయంలోనూ డైరెక్టర్ల వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో వారితో రాజీనామా చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 మంది డైరెక్టర్లు మంగళవారం రాత్రి వారి రాజీనామాలను ఉన్నతాధికారులకు అందజేశారు. వాటిని బుధవారం ప్రభుత్వం ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని