రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో.. సాంకేతిక సమస్యలను అధిగమించాలి

డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

Published : 03 Jul 2024 04:47 IST

అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశం

ఈనాడు-అమరావతి: డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రిజిస్ట్రేషన్‌శాఖ పనితీరుపై మంగళవారం తొలిసారిగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ-స్టాంపింగ్‌ లేదా స్టాంపుల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్‌ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మ్యుటేషన్ల విషయంలోనూ జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్స్‌ లేనందున, కనీసం వంద మందిని తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపారు. సమావేశంలో భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్, రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని