18 వేల టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 03 Jul 2024 04:14 IST

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్‌ మెరైన్‌ లాజిస్టిక్స్‌లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్‌ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం పట్టుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల రేషన్‌ బియ్యానికి ఈ సరకు అదనం. గోదాముల్లో దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని