కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 03 Jul 2024 04:11 IST

శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను మూడు, నాలుగు రోజులపాటు పొడిగిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని