నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది.

Published : 02 Jul 2024 05:42 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. ప్రత్యేక కేటగిరీ వారి ధ్రువపత్రాల పరిశీలనకు 4 నుంచి 6 వరకు సమయం ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలనకు 5 నుంచి సహాయ కేంద్రాలను ప్రారంభించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు ఈ నెల 11 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. 19 న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20-22 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల- విజయవాడ, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ కళాశాల-విశాఖపట్నం, ఎస్వీ విశ్వవిద్యాలయం-తిరుపతిలో సహాయ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని