ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం

ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 02 Jul 2024 05:40 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉన్నత విద్యామండలి నుంచి వెళ్లిపోయిన ఓ అధికారిణి తనను బెదిరిస్తున్నారని పేర్కొంటూ సంయుక్త సంచాలకులు సెలవుపై వెళ్లిపోయారు. అధికారి బెదిరింపులపై లేఖ రాసి ఉన్నత విద్యామండలి కార్యదర్శికి, ఉన్నత విద్యాశాఖకు ఆయన పంపించారు. పాతవారి అండదండలతోనే తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల రోజు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి, వెళ్లిపోయిన హేమచంద్రారెడ్డి సోమవారం కార్యాలయానికి వచ్చారు. కొంత సమయం కార్యాలయంలో ఉన్న ఆయన మరో పది రోజులు సెలవుపెట్టి వెళ్లిపోయారు. సెలవు పెట్టేందుకే ఆయన వచ్చారా? లేదంటే ఇతర అంశాలపై మాట్లాడేందుకు వచ్చారా? అని సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని