చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు.

Published : 02 Jul 2024 05:39 IST

దిల్లీలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా ఎంపీలు

ఈనాడు, దిల్లీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రంలోపు 95% మందికి ఇళ్లవద్దకే వెళ్లి పెద్దమొత్తంలో పింఛను అందించడం అన్నది దేశంలో ఒక చరిత్ర అని పేర్కొన్నారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ మొదలుపెట్టిన పింఛను విధానాన్ని చంద్రబాబు మరింత విస్తరించి పేదలకు పెద్దకొడుకుగా మారారని ఎంపీలు శ్లాఘించారు. సంక్షేమం, అభివృద్ధి అన్నది ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమని చంద్రబాబు మరోసారి నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కేశినేని చిన్ని, హరీష్‌మాథుర్‌ బాలయోగి, అంబికా లక్ష్మినారాయణ, శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, దగ్గుమళ్ల ప్రసాద్,  కృష్ణప్రసాద్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని