‘స్టాప్‌ డయేరియా’పై విస్తృత అవగాహన

డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్‌ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Published : 02 Jul 2024 05:00 IST

వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌

అనంతపురం (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్‌ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం అనంత కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘స్టాప్‌ డయేరియా’ రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. డయేరియా ప్రచార పత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆరోగ్యశాఖకు చెందిన పలు అంశాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యాధికారులతో ప్రత్యేక   సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్, జేసీ కేతన్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని