విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశాలతో ఈ సేవలను సోమవారం పునఃప్రారంభించారు.

Published : 02 Jul 2024 04:51 IST

రిబ్బను కత్తిరించి కార్గో సేవలను ప్రారంభిస్తున్న విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి 

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశాలతో ఈ సేవలను సోమవారం పునఃప్రారంభించారు. 2021లో అప్పటి వైకాపా ప్రభుత్వం నిలుపుదల చేసిన కార్గో సేవలను తిరిగి పునరుద్ధరించడం సంతోషకరమని వ్యాపారులు, విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. కార్గో సేవలతో రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులు, పూలు, పండ్లు, పరిశ్రమల ఉత్పత్తులను దేశంలోనే ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలో... గంటల వ్యవధిలో చేర్చేందుకు అవకాశం కలుగుతుందని విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని