ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరం

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమని రాష్ట్ర రవాణా, వ్యవసాయశాఖ మంత్రులు మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 04:50 IST

రవాణా, వ్యవసాయ శాఖల మంత్రుల వెల్లడి

ఆర్టీసీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్‌ప్రసాద్‌రెడ్డి 

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమని రాష్ట్ర రవాణా, వ్యవసాయశాఖ మంత్రులు మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి అచ్చెన్నాయుడి కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో పలు అంశాలపై రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందించవలసిన ఆర్టీసీ సేవలు, బస్సులకు మరమ్మతులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో అమరావతి, విజయనగరం ఈడీలు రవివర్మ, రామానంద్‌రెడ్డి, చంద్రశేఖర్, విజయ్‌కుమార్‌లతో పాటు ఆయా కార్యాలయాల సిబ్బంది, టెక్కలి డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని