కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 02 Jul 2024 04:47 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలో బాలికల వసతిగృహంలో విద్యార్థినులను విచారిస్తున్న డీఎంహెచ్‌వో నాగరాజు

ఖాజీపేట, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు అవడంతో తల్లిదండ్రులు వారిని కడప రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనంతో పాటు కలుషిత నీరు తాగడం వల్ల తమకు మూడు రోజులుగా వాంతులు, విరేచనాలు అవుతున్నాయని విద్యార్థినులు మీడియాకు తెలియజేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో తాగునీటి ట్యాంకులను, వంటశాలను డీఎంహెచ్‌వో నాగరాజు, డిప్యూటీ డీఈవో రాజగోపాల్‌రెడ్డి, తహసీల్దారు, పంచాయతీ అధికారులు పరిశీలించారు. ట్యాంకులు శుభ్రం చేయకుండా కలుషిత నీటినే వంటకు వాడటం, వాటినే బాలికలు తాగడానికి వినియోగించడంతోనే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని