ప్రక్షాళన దిశగా ఆర్థికశాఖ

ఆర్థికశాఖ ప్రక్షాళన దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన పలువురు అధికారుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.

Published : 02 Jul 2024 04:41 IST

సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓగా వినయ్‌చంద్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆర్థికశాఖ ప్రక్షాళన దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన పలువురు అధికారుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పీయూష్‌కుమార్‌ను నియమించింది. తాజాగా ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు, ఏపీ స్టేట్‌ ప్లానింగ్‌ సొసైటీ సీఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌(ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌రెడ్డిని బదిలీ చేసింది. ఆయన్ను అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓగా వాడ్రేవు వినయ్‌చంద్‌ వ్యవహరిస్తారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని