అమరావతిపై 3న శ్వేతపత్రం విడుదల

ఐదేళ్ల జగన్‌ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు 3న (బుధవారం) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

Published : 02 Jul 2024 04:40 IST

పురపాలక మంత్రి, సీఆర్‌డీఏ అధికారులతో సీఎం సమీక్ష

ఈనాడు, అమరావతి: ఐదేళ్ల జగన్‌ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు 3న (బుధవారం) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు, ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సోమవారం సచివాలయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏడీసీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి, సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని