‘సార్వత్రిక’ పది పరీక్షల్లో 63% మంది ఉత్తీర్ణత

సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి పరీక్షల్లో 63.30% మంది, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో 69.07% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం విడుదల చేశారు.

Published : 02 Jul 2024 04:36 IST

ఇంటర్‌లో 69.07% 
ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

ఈనాడు, అమరావతి: సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి పరీక్షల్లో 63.30% మంది, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో 69.07% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 15,058 మంది హాజరు కాగా.. 9,531 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలను 27,279 మంది రాయగా.. 18,842 మంది పాసయ్యారు. పదో తరగతిలో బాలురు 60.53%, బాలికలు 66.43%, ఇంటర్‌లో బాలురు 67.82%, బాలికలు 71.35% మంది ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 97.28 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా 9.25 శాతంతో అట్టడుగున నిలిచింది. ఇంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 88.95 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా.. 36.07 శాతంతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 8 లోపు దరఖాస్తు చేసుకోవాలని, రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని