క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఆరోగ్యశ్రీ వంటి ఉచిత ఆరోగ్య సేవల్లో చేర్చడం ద్వారా ప్రజలు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు.

Published : 02 Jul 2024 04:33 IST

ప్రముఖ ఆంకాలజిస్ట్‌ నోరి దత్తాత్రేయుడు

రాజానగరం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఆరోగ్యశ్రీ వంటి ఉచిత ఆరోగ్య సేవల్లో చేర్చడం ద్వారా ప్రజలు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఈ విషయం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేసినట్లు సోమవారం డాక్టర్స్‌ డే సందర్భంగా చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్‌ మహమ్మారి కాదని, ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని గుర్తించడం ద్వారా 98 శాతం తగ్గిచుకోవచ్చన్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏటా కొత్తగా 1.5 మిలియన్ల కేసులు నమోదవుతున్నాయని వివరించారు. మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు అధికంగా గురవుతున్నారన్నారు. మన దేశంలో ప్రతిరోజు 1600 మంది పురుషులు, 200 మంది మహిళలు దీని కారణంగా మృతి చెందుతున్నారన్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించాలంటే స్క్రీనింగ్‌ టెక్నాలజీని మర్చాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్‌ఎల్‌ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని