కృషి, పట్టుదలతోనే గుర్తింపు

కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీఈఓ, డైరెక్టర్‌ నగ్మా ముల్లా అన్నారు.

Published : 01 Jul 2024 04:54 IST

ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీఈఓ నగ్మా ముల్లా

శేషకుమారి చిత్రపటం వద్ద నగ్మా ముల్లా. చిత్రంలో డాక్టర్‌ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, జేఎన్‌టీయూకే వీసీ ప్రసాదరాజు తదితరులు

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీఈఓ, డైరెక్టర్‌ నగ్మా ముల్లా అన్నారు. ప్రముఖ సామాజిక సేవకురాలు లక్కరాజు శేషకుమారి జయంతి సందర్భంగా సంకురాత్రి ఫౌండేషన్, జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ సూర్య కళామందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై నగ్మా ప్రసంగించారు. తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తే వారి పిల్లల డీఎన్‌ఏలో కష్టపడేతత్వం స్వభావ సిద్ధంగా ఉంటుందని, అదే విజయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. సహాయం చేయడంలో ఉన్న ఆనందం కోసం తాను ఎడెల్‌గివ్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేశానని తెలిపారు. సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చంద్రశేఖర్, జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, విశ్రాంత మేజర్‌ జనరల్‌ జ్యోతుల ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లం రాజు, కైట్‌ విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వం తదితరులు మాట్లాడారు. దివంగత లక్కరాజు శేషకుమారి సామాజిక సేవలను కొనియాడారు. లక్కరాజు సత్యనారాయణ.. అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో పెద్దాడ సూర్యకుమారి, లక్ష్మీ, జేఎన్‌టీయూకే ఫ్రొఫెసర్‌ మురళీకృష్ణ, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని