ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి

గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి.

Published : 01 Jul 2024 04:53 IST

షెడ్డు కూలడంతో కోళ్ల ఫారంలో దుస్థితి

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం శివారులోని ఆరూష్‌ ప్రొటీన్‌ ఫామ్స్‌లో సుమారు 27 వేల కోళ్లు ఉన్నాయి. ఈదురుగాలులకు ఎకో కోళ్ల ఫారం షెడ్డు కూలిపోయి, వర్షం నీరు కూడా లోపలికి వెళ్లడంతో 20 వేల కోళ్లు చనిపోయాయని ఫారం యజమాని తోట సుబ్బారావు తెలిపారు. అధునాతన పద్ధతిలో కొద్దికాలం కిందటే ఫారం ఏర్పాటు చేశామని, షెడ్డు కూలిపోవడంతో రూ.కోటిన్నర వరకు నష్టం వాటిల్లిందని యజమాని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని