ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు.

Updated : 01 Jul 2024 10:22 IST

న్యాయం చేసి ఆదుకోండి

విలేకర్లతో మాట్లాడుతున్న దేవకీదేవి

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. ఆదివారం ఆమె విశాఖలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘నాలుగేళ్ల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో డ్వాక్రాబజారు ఏర్పాటుకు అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డిని సంప్రదించాం. అందుకు ఆయన అంగీకరించి ఏయూ ఉన్నత పాఠశాల మైదానం అప్పగించారు. మైదానాన్ని రూ.8 లక్షలతో బాగుచేయించాం. తర్వాత బజారు ఏర్పాటుకు ఏయూకు రూ.18లక్షల చెక్కులు అప్పటి రిజిస్ట్రార్‌కి అందించాం. డ్వాక్రా బజారుకు అవసరమయ్యే రూ.50లక్షల సామగ్రి కొనుగోలు చేసి మైదానానికి తీసుకొచ్చి పెట్టాం. ఈలోగా రాజారెడ్డి అనే వ్యక్తి వచ్చి తాను ఎగ్జిబిషన్‌ పెడతానని మైదానం తీసుకున్నారు. ఈ విషయం వీసీ దృష్టికి తీసుకువెళ్లగా వందరోజుల తర్వాత మీరు పెట్టుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మాకు మైదానం అప్పగించలేదు. ఇదే విషయం ప్రసాదరెడ్డికి చెబుదామంటే మమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వలేదు. విశాఖపట్నంలో కనిపిస్తే చంపేస్తామంటూ రాజారెడ్డి, రవి అనే వ్యక్తితో పాటు ఏయూ నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. అప్పట్లో ఈ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే బుట్టదాఖలు చేశారు. నేను ఏయూకు డి.డి.ల రూపంలో ఇచ్చిన మొత్తం, కొనుగోలు చేసిన సామగ్రి తిరిగి అప్పగించాలి. మాకు జరిగిన మోసంపై మళ్లీ పోలీసులకు, సీబీఐకి రెండు, మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తాను’’ అని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు