కొన్ని వెబ్‌సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే

ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లకు వైకాపా రంగులు, వైఎస్సార్‌ పేరు అలాగే కొనసాగుతున్నాయి.

Updated : 01 Jul 2024 05:16 IST

మార్చాలని ఆదేశాలున్నా బేఖాతరు
పలువురు ఉన్నతాధికారులపై విమర్శలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లకు వైకాపా రంగులు, వైఎస్సార్‌ పేరు అలాగే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు గ్రామ, వార్డు సచివాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. అందులోని డాష్‌బోర్డుతో సహా ఏ పేజీ తెరిచినా నీలం, ఆకుపచ్చ రంగులు కనపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ యాప్‌నకు, వెబ్‌సైట్‌కు ఇంకా వైఎస్సార్‌ పేరు కొనసాగుతోంది. వెబ్‌సైట్‌ లోపల పథకాల పేర్లు, పాత ఫొటోలు మార్చినా పైన ఉండే యూఆర్‌ఎల్‌లో పాత పేర్లే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా బులుగు రంగు, వైఎస్సార్‌ పేరు మార్పుపై ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పలు శాఖల ఉన్నతాధికారులు మారినా పాత అధికారుల పేర్లే కొనసాగుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని