తితిదే వెబ్‌సైట్‌లో బోర్డు నిర్ణయాలు

భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 01 Jul 2024 04:44 IST

భక్తులకు అందుబాటులో లేని గత బోర్డు తీర్మానాలు 

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తితిదే ధర్మకర్తల మండలి, స్పెసిఫైడ్‌ అథారిటీలు 1993 మే పదో తేదీ నుంచి గతేడాది జూన్‌ 19వ తేదీ వరకు తీసుకున్న నిర్ణయాలను ఇదివరకే తితిదే వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఆ తరువాత అప్‌లోడ్‌ చేయలేదు. గత పాలక మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తితిదే ధర్మకర్తల మండలి భారీగా తితిదే నిధులను కాంట్రాక్టులకు మంజూరు చేయడంతోపాటు కీలక నిర్ణయాలను తమకు అనుకూలంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పాలకమండలి నిర్ణయాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకుండా చేశారు. మొదట్లో తితిదే పాలకమండలి సమావేశాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఈ విధానానికీ స్వస్తి పలికారు. బోర్డు తీర్మానాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీనిపై ప్రజాసంఘాలు, మీడియాల్లో కథనాలు ప్రచురితమైనా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈవోగా జె.శ్యామలరావు బాధ్యతల స్వీకరించాక చేపడుతున్న ప్రక్షాళనలో భాగంగా గత పాలకమండలి నిర్ణయాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని