ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఉంటాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు.

Published : 01 Jul 2024 04:36 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఉంటాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. మల్లికార్జున మహామండపంలో వారాహి నవరాత్రి కలశస్థాపన చేస్తామని, అమ్మవారి అలంకరణలో ఎటువంటి మార్పూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. పంచ వారాహి మంత్రాలు, చండీ, రుద్రహోమాలు నిర్వహిస్తామని తెలిపారు. లోక కల్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నవరాత్రి ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ వివరించారు. నిత్యం చండీపారాయణ, రుద్రపారాయణలు, ఉదయం, సాయంత్రం పూజాహారతి, మంత్రపుష్పాలు నివేదన చేస్తారని తెలిపారు. 15న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని