పింఛన్ల పంపిణీని విజయవంతం చేద్దాం

గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చంద్రబాబు పాలనలో ఆ కష్టాలు ఉండబోవని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు కొండారెడ్డి నరహరి వరప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 01 Jul 2024 04:09 IST

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆత్మీయ సమావేశం

కొండారెడ్డి నరహరి వరప్రసాద్‌కు వినతిపత్రం ఇస్తున్న గునిపే రాజేష్, శ్రీరామ అజయ్‌కుమార్, బి.పాండురంగ, ఎం.రాజేష్‌ 

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చంద్రబాబు పాలనలో ఆ కష్టాలు ఉండబోవని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు కొండారెడ్డి నరహరి వరప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వాటిని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గునిపే రాజేష్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జులై 1న సీఎం చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీని విజయవంతం చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. నరహరి వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బి.పాండురంగ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.రాజేష్, కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్‌రాజ్, సంయుక్త కార్యదర్శి శశికళ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని