ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

Published : 01 Jul 2024 04:41 IST

వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం

ఆరో తరగతిలో ఒకే విద్యార్థికి పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు 

సోంపేట, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరిట తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులను కేటాయించారు. గత ఏడాది 22 మందితో పాఠశాలను నడిపారు. వారిలో పదో తరగతి విద్యార్థులు నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11 మంది టీసీలు తీసుకుని ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడో తరగతిలో ఒకరు,

ఏడో తరగతిలో ముగ్గురు విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

నాలుగో తరగతిలో ఇద్దరు, ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ముగ్గురు మాత్రమే మిగిలారు. వారికి ఏడుగురు స్కూలు అసిస్టెంట్లు పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రాలకు సంబంధించి ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల జీతభత్యాలు, మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వాహకులు, ఆయా వేతనాలు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు రూ.7 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మ్యాపింగ్‌ పాఠశాలల్లో విద్యార్థులతో సంబంధం లేకుండా స్కూలు అసిస్టెంట్లను నియమించాలనే ఆదేశాల మేరకు ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని