కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్‌

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ స్పష్టం చేశారు.

Published : 30 Jun 2024 05:44 IST

రామచంద్రపురం, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మంత్రిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల కార్మిక సంక్షేమ నిధిని నవరత్నాలకు మళ్లించిందని ఆరోపించారు. 2019 వరకు క్లెయిముల పరిష్కారం బాగానే జరిగేదని, ఆ తర్వాత జీవో నంబరు 17 తెచ్చి కార్మికులకు అన్యాయం చేశారని సంఘం ప్రతినిధులు వాపోయారు. దాదాపు 42 వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండిపోయాయని పరిష్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని