జీజీహెచ్‌ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్‌) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 30 Jun 2024 05:43 IST

అత్యవసర విభాగంలో వార్డు పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, చిత్రంలో ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్, రామాంజనేయులు

ఈనాడు, అమరావతి: గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్‌) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అవసరమైన వైద్య పరికరాలు, సామగ్రి మొదలుకుని, మౌలిక వసతుల కల్పన దాకా చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు రూపొందించి రెండు వారాల్లో తనకు అందజేయాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుందామని వైద్యులకు సూచించారు. తొలిసారిగా శనివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. పలు విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు.. వసతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యలపై వైద్యులతో సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని