లోక్‌ అదాలత్‌కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు.

Published : 30 Jun 2024 05:43 IST

హైకోర్టు లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.హరినాథ్, జస్టిస్‌ జి.నరేందర్, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ. చిత్రంలో పరిపాలనాధికారి అమరరంగేశ్వరరావు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ జి.నరేందర్‌ మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 384 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న పలు కేసుల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. 

హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ పాల్గొన్నారు. 192 కేసులు పరిష్కరించారు. రూ.1.77 కోట్ల పరిహారం అందజేశారు. లోక్‌ అదాలత్‌ విజయవంత కావడానికి సహకరించిన వారికి ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని