నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్‌ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 30 Jun 2024 05:42 IST

ఈనాడు, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్‌ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రాజశేఖర్‌ రాజీనామా చేయాలంటూ కొన్నాళ్లుగా ఏఎన్‌యూలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘంతో పాటు అమరావతి రైతులు సైతం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం కూడా టీఎన్‌ఎస్‌ఎఫ్, జనసేన విద్యార్థి విభాగం నాయకులు కొందరు ఆయన ఛాంబర్‌కు వెళ్లగా ఆ సమయంలో ఆయన లేరు. దీంతో వారు తలుపులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఎట్టకేలకు ఆయన శనివారం రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపడంతో ఆందోళనలకు తెరపడింది. నాలుగున్నరేళ్లుగా వీసీగా, ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చి, వైకాపాకు అనుకూలంగా పనిచేశారనే విమర్శలున్నాయి. మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు సైతం నిర్వహించారు. జై జగన్‌ నినాదాల నడుమ ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో వైఎస్సార్, జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వర్సిటీ ప్రధానగేటు వద్ద సజ్జల, జగన్‌ బొమ్మలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఇలా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని