‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’

ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు.

Published : 30 Jun 2024 05:40 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడారు. నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ కావడంతో కేసు నమోదు నుంచి విచారణ వరకు అతడిని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ గన్‌మెన్లు ఎక్కడున్నారు? అనే కోణంలో విచారణ చేయలేదని అన్నారు. రంపచోడవరం ఏజెన్సీలో సుమారు 200 ఎకరాలు భూములు ఆక్రమించి చేపల చెరువులు ఏర్పాటు చేసి, వాటికి రిజర్వాయర్‌ జలాలను ఎమ్మెల్సీ అనంతబాబు మళ్లిస్తున్నారని ముప్పాళ్ల ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని