కృష్ణపట్టిలో పెద్దపులి

కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్‌తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు.

Published : 29 Jun 2024 06:33 IST

20ఏళ్ల తర్వాత కనపడిన రాబందు

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ప్రత్యక్షమైన రాబందు

దేవరకొండ, న్యూస్‌టుడే: కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్‌తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. దీంతో పాటు అంతరించిపోతున్న జాతికి చెందిన రాబందు సైతం నల్లమలలో కనపడినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్స్‌ కెమెరాలో చాలా ఏళ్ల తర్వాత పెద్దపులి కనపడిందని, కంబాలపల్లి రేంజ్‌ పరిధిలోని కృష్ణపట్టి ఏరియాలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

కంబాలపల్లి రేంజ్‌ వద్ద ట్రాప్స్‌ కెమెరాలో చిక్కిన పెద్దపులి

కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ప్రాంతం నుంచి నల్లమల అటవీ ప్రాంతం వరకు పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు. కృష్ణాపరీవాహక ప్రాంతం, డిండి నది అడుగంటడంతో పెద్దపులి అనువుగా ఉన్న ప్రదేశం కోసం సంచరిస్తూ దేవరకొండ నియోజకవర్గంలోని నల్లమలకు చేరింది. నిత్యం 40 కిలోమీటర్లు ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతోపాటు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో రాబందు కూడా ప్రత్యక్షమైందని, నల్లమల అడవిలోని కంబాలపల్లి రేంజ్‌ పరిధిలో శాఖాహార జంతువులు, నీళ్లు తదితర సదుపాయాలు పెరగడంతో ఈ రెండు జంతువులు ఇక్కడికి చేరినట్లు నాగార్జునసాగర్‌ రిజర్వ్‌ డీఎఫ్‌వో సర్వేశ్వర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని