14 అడుగుల గిరినాగు పట్టివేత

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్‌ కోబ్రా) హల్‌చల్‌ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది.

Published : 29 Jun 2024 06:25 IST

గిరినాగును పట్టుకుంటున్న వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్‌ కోబ్రా) హల్‌చల్‌ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కొంతమంది యువకులు ఇంట్లోకి వెళ్లి చూసి పాము అక్కడే ఉందని నిర్ధారించుకున్నాక అటవీ శాఖ అధికారుల ద్వారా విశాఖలోని వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమితి సభ్యులు గిరినాగును పట్టుకొని, అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని