దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!

పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి.

Published : 29 Jun 2024 06:22 IST

అడ్డివాడ గిరిజన గ్రామ రహదారి దుస్థితి

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. వరదకు రోడ్డు ఎక్కడికక్కడ కోతకు గురవడంతో ఇప్పుడు నడవడానికీ వీల్లేకుండా పోయింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని అడ్డివాడ గ్రామానికి ఉన్న దారి దుస్థితి. ఈ గిరిజన గ్రామానికి 2017లో తెదేపా హయాంలో రూ.80 లక్షలతో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టి, పనులు ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో రూ.1.75 కోట్లతో పక్కా రహదారి పనులు చేపట్టారు. కానీ, బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తారు వేసి రోలర్‌ తిప్పించకపోవడం, నాణ్యత లేకపోవడంతో వర్షాలకు బీటీ అంతా కొట్టుకుపోతోంది. చాలా చోట్ల రోడ్డు కాలువల్లా మారింది. దీంతో గిరిజనుల అవస్థలు మళ్లీ మొదటికి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని