తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల కలకలం

తిరుమల-అలిపిరి మొదటి ఘాట్‌ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు.

Updated : 29 Jun 2024 06:43 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల-అలిపిరి మొదటి ఘాట్‌ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి. సమీపంలోని చెట్లను విరగ్గొడుతుండటంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వాటిని చూసి వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఘాట్‌ రోడ్డు భద్రతా, అటవీశాఖ సిబ్బంది వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమారు. అనంతరం రాకపోకలు పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని