ఒక అధికారి వెనక్కు

వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అనేకమంది డిప్యుటేషన్‌పై పట్టణ స్థానిక సంస్థల్లో కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా పని చేస్తున్నారు. వారిలో ఒకరిని ప్రభుత్వం వెనక్కి రప్పించింది.

Published : 29 Jun 2024 06:05 IST

పట్టణ స్థానిక సంస్థల్లో డిప్యుటేషన్లపై ప్రభుత్వం దృష్టి

ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అనేకమంది డిప్యుటేషన్‌పై పట్టణ స్థానిక సంస్థల్లో కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా పని చేస్తున్నారు. వారిలో ఒకరిని ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ఏలూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఎన్‌.రాధను అక్కడి నుంచి తప్పించి పురపాలకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని శుక్రవారం ఆదేశించింది. గుంటూరు వైద్య కళాశాలలో అధ్యాపకురాలైన ఆమె.. పొన్నూరు పురపాలక కమిషనర్‌గా కొన్నాళ్లు పని చేశారు. 2023 జూన్‌ నుంచి ఏలూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేయడంతో పాటు అదే శాఖలో విలీనమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఈ నెల 26న ‘డిప్యుటేషన్‌పై వచ్చి పురపాలికల్లో తిష్ఠ’ శీర్షికతో ‘ఈనాడు’లో ఇచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టింది. విశాఖపట్నం, నెల్లూరు, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, తిరుపతి తదితర నగరపాలక సంస్థల్లోనూ డిప్యుటేషన్‌పై అదనపు కమిషనర్లుగా పలువురు పని చేస్తున్నారు. మరో 34 పురపాలక సంఘాల్లోనూ కమిషనర్లుగా ఉన్నారు. వీరందరిపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు