పని ఒత్తిడి తగ్గించండి

వివిధ శాఖల నుంచి అనధికారికంగా కేటాయిస్తున్న పనుల నుంచి తమకు విముక్తి కలిగించాలని గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు(మహిళా పోలీసులు) కోరారు.

Published : 29 Jun 2024 06:05 IST

హోం మంత్రికి మహిళా సంరక్షణ కార్యదర్శుల వినతి 

ఈనాడు డిజిటల్, అమరావతి: వివిధ శాఖల నుంచి అనధికారికంగా కేటాయిస్తున్న పనుల నుంచి తమకు విముక్తి కలిగించాలని గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు(మహిళా పోలీసులు) కోరారు. ఈ మేరకు మహిళా పోలీస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల్ని వివరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘సర్వీసు రిజిస్టర్లు జిల్లాలోనే అప్‌డేట్‌ అయ్యేలా డీజీపీ నుంచి ఉత్తర్వులు ఇప్పించండి. కేటగిరీ-1 పరీక్ష రాసి మెరిట్‌ లిస్టులో ఎంపికైన వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి తగ్గకుండా పోస్టుల్లో నియమించాలి’’ అని కోరారు. త్వరలోనే కమిటీ వేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్‌ అధ్యక్షురాలు దుర్గం మధులత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని