1 నుంచి ట్రిపుల్‌ ఐటీ దరఖాస్తుల పరిశీలన

ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.అమరేంద్రకుమార్‌ తెలిపారు.

Published : 29 Jun 2024 06:04 IST

జులై 11న ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల
ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఆచార్య అమరేంద్రకుమార్‌ 

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.అమరేంద్రకుమార్‌ తెలిపారు. నూజివీడులోని కళాశాల ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25తో దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసిందని పేర్కొన్నారు. మొత్తం 53,863 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి 34,154, ప్రైవేటు స్కూళ్ల నుంచి 19,671, ఇతర రాష్ట్రాల నుంచి 38 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో అమ్మాయిలు 30,857, అబ్బాయిలు 23,006 మంది ఉన్నారని తెలిపారు. దరఖాస్తులను నూజివీడు క్యాంపస్‌లో పరిశీలిస్తారన్నారు. క్యాంపస్‌ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను జులై 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని