కాలినడకన తిరుమలకు రాజధాని రైతులు

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు బృందాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు.

Published : 27 Jun 2024 06:09 IST

కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న అమరావతి రాజధాని రైతులు

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు బృందాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు. పాదయాత్ర చేపట్టిన రెండు బృందాల్లో ఒకటి బుధవారం తిరుమలకు చేరింది. రాజధాని పరిధిలోని వెంకటపాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి దాదాపు 11 మంది రైతులు తిరుమలకు కాలినడకన ఈనెల 13న బయలుదేరారు. 14 రోజుల్లో రోజుకు 35 కి.మీ.చొప్పున నడుస్తూ మంగళవారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం మొక్కులో భాగంగా తిరుమలకు వచ్చినట్లు బృందానికి నేతృత్వం వహించిన ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆలపాటి బాలచంద్రరావు తెలిపారు. అమరావతే రాజధాని అంటూ అధికారంలోకి వచ్చిన గత వైకాపా ప్రభుత్వం మాట తప్పిందని.. రాజధానికి 33 వేల ఎకరాలిచ్చిన రైతులను రోడ్డున పడేసిందని బృందంలోని అబ్బూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో తమ పోరాటం విజయవంతమైందని జొన్నలగడ్డ భాస్కరరావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని