హైకోర్టులో ప్రత్యేక పన్నుల బెంచ్‌ ఏర్పాటుకు కృషి చేయాలి

పన్ను ఎగవేతదారులను నియంత్రించి, సక్రమంగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించాలని వాణిజ్య పన్నుల అధికారులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ సూచించారు.

Updated : 27 Jun 2024 05:46 IST

ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: పన్ను ఎగవేతదారులను నియంత్రించి, సక్రమంగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించాలని వాణిజ్య పన్నుల అధికారులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ సూచించారు. రాష్ట్రంలో వస్తువుల వినిమయం పెరిగేలా చూడాలని కోరారు. బుధవారం వాణిజ్య పన్నుల కమిషనర్‌ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైకోర్టులో ప్రత్యేక పన్నుల బెంచ్‌ ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. రానున్న వంద రోజుల్లో చేయాల్సిన పనులను వారికి నిర్దేశించారు. సమావేశంలో చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్‌ ఆనంద్, కమిషనర్లు రమేశ్, రవిశంకర్, ప్రాంతీయ అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని