ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించొద్దు

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 27 Jun 2024 04:35 IST

కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం 

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. శాసనమండలి వ్యవహారాల కార్యదర్శి, ట్రైబ్యునల్‌ హోదాలో శాసనమండలి ఛైర్మన్, విప్‌ విక్రాంత్‌లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 10కి వాయిదా వేసింది. జస్టిస్‌ చీమలపాటి రవి బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో శాసనమండలి విప్‌ విక్రాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైకాపా ఎమ్మెల్సీ రఘురాజును అనర్హుడిగా ప్రకటిస్తూ మండలి ఛైర్మన్‌ ఈ నెల 3న ఉత్తర్వులిచ్చారు. దీనిని సవాలు చేస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ సతీమణి తెదేపాలో చేరారనే కారణంతో ఎమ్మెల్సీ పదవికి రఘురాజును అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారన్నారు. ఆమె నిర్ణయానికి పిటిషనర్‌ను బాధ్యుణ్ని చేయడం సరికాదని కోర్టుకు నివేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని