Hyderabad: వైకల్యమా.. బ్రో.. ఉయ్‌ డోంట్‌ కేర్‌

వీరిద్దరు దివ్యాంగులు.. అయితేనేం  ఆత్మస్థైర్యంతో విధిని జయించారు.. ఆటల్లో చక్కగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు.

Updated : 27 Oct 2023 08:53 IST

వీరిద్దరు దివ్యాంగులు.. అయితేనేం  ఆత్మస్థైర్యంతో విధిని జయించారు.. ఆటల్లో చక్కగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు. హరియాణాకు చెందిన   జ్యోతికి పుట్టుకతోనే అంగవైకల్యం. కృత్రిమ కాలు ధరించి క్రీడల్లో పాల్గొంటోంది. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఉప్పర శివాని విద్యుదాఘాతానికి గురై కుడిచేయి కోల్పోయింది. అయినా క్రీడల్లో సత్తా చాటుతోంది. గుజరాత్‌లో జరిగిన పోటీల్లో జ్యోతి సిట్టింగ్‌ జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లో, శివాని ఎఫ్‌-46 విభాగం జావెలిన్‌ త్రోలో బంగారు పతకాలు సాధించారు. డిసెంబరులో థాయిలాండ్‌లో జరిగే ప్రపంచ సామర్థ్య క్రీడల్లో పాల్గొననున్నారు. అందుకోసం సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌ రోడ్డులోని కంటోన్మెంట్‌ హాకీ మైదానంలో శిక్షణ పొందుతున్నారు. వీరిద్దరూ గచ్చిబౌలిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు