Vande Bharat Express: విజయవాడ - చెన్నై మధ్య వందేభారత్‌

ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి.

Updated : 03 Jul 2023 07:57 IST

ఈనెల 7 నుంచి ప్రారంభం
రేణిగుంట మీదగా ప్రయాణం?

ఈనాడు-అమరావతి, చెన్నై: ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ రైలు 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

రేణిగుంట మీదగా వెళ్తుందా?

విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో స్టాపేజీ ఉంటుంది, రాకపోకల షెడ్యూల్‌, టిక్కెట్‌ ధరలు.. తదితరాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ రైలును రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు కోరినట్లు తెలిసింది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నై వెళ్లి.. అదే మార్గంలో తిరిగి రానుంది. విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని