Tirupati: చదువుతూ సాగిపోదాం.. బస్సులో!

పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్‌ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్‌ఫోన్‌లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు.

Updated : 01 Jul 2024 08:31 IST

బస్సులో డ్రైవర్‌ జీఆర్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన పుస్తకాలు

పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్‌ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్‌ఫోన్‌లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. జీఆర్‌ కుమార్‌ ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్‌. తిరుపతి- మదనపల్లె మధ్య తిరిగే ఏసీ బస్సును నడుపుతున్నారు. ఇటీవల కాలంలో అందరూ సెల్‌ఫోన్‌లకే పరిమితమై పోతున్నారని, పుస్తక పఠనం తగ్గిపోతోందని ఆలోచించి బస్సులో నీతి కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంచారు. బస్సు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరేలోపు ఏదైనా తీసుకొని చదువుకోవచ్చు. జీఆర్‌ కుమార్‌ చొరవను ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందిస్తున్నారు.  

ఈనాడు, తిరుపతి

మొబైల్స్‌ పక్కనపెట్టి పుస్తకాలు చదువుతున్న ప్రయాణికులు

తిరుపతి-మదనపల్లె ఏసీ బస్సు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని