Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి.

Updated : 30 Jun 2024 07:46 IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. తాజాగా కార్గో సేవల పునరుద్ధరణకు పిలిచిన టెండర్‌ను ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ దక్కించుకుంది. విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి శనివారం మాట్లాడుతూ..రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు పూలు, పండ్లు, మిర్చి, తదితర ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చేందుకు కార్గో సర్వీసు దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సర్వీసు నడిపేందుకు కస్టమ్స్‌ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని