Machilipatnam: మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు

మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో భేటీ అయ్యారు.

Updated : 05 Jul 2024 08:52 IST

త్వరలో అధికారిక ప్రకటన

ఈనాడు, అమరావతి: మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా.. మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు. దీనిపై కేంద్రమంత్రి పురి, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని.. రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని.. భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని బాలశౌరి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని