Nallamala: 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న

నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో కెమెరా ట్రాప్‌లో దాని చిత్రాలు నమోదయ్యాయి.

Published : 03 Jul 2024 04:06 IST

నల్లమలలో సంచరిస్తున్న అడవి దున్న

ఆత్మకూరు, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో కెమెరా ట్రాప్‌లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో అటవీ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 1870 తర్వాత మళ్లీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో మొదటిసారి అడవి దున్నను గుర్తించినట్లు ఆత్మకూరు అటవీ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా తెలిపారు. అక్కడినుంచి అది గత నెలలో బైర్లూటి రేంజ్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటక వైపు నుంచి ఈ దున్న కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని