AP TET 2024: ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు.

Published : 02 Jul 2024 06:22 IST

నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ ప్రత్యేక విద్య స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెట్‌ దరఖాస్తు రుసుమును ఈ నెల 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈనెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు 10న, తుది కీని 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని